Pawan Kalyan: రేపు కొండగట్టులో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు
Special Pooja for Jana Party Vehicle Varahi at Kondagattu Anjaneya Swamy temple
జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి రేపు ఉదయం శాస్త్రోక్తంగా పూజలు జరగనున్నాయి. జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి వారి ఆలయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం చేరుకుంటారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. పూజా కార్యక్రమాల నిమిత్తమై మంగళవారం ఉదయం సుమారు 9 గంటలకు ఆయన కొండగట్టు క్షేత్రానికి చేరుకుంటారు.
వారాహికి పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా మరో 31 నారసింహ క్షేత్రాలను దశల వారీగా సందర్శిస్తారు.
ధర్మపురిలో దర్శన అనంతరం సాయంత్రం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.
రేపు కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించనున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి రూట్ మ్యాప్.@JSPTelangana #ChaloKondagattu #ChaloDharmapuri #JanaSenaTelangana pic.twitter.com/8ytuIPl3P1
— JanaSena Party (@JanaSenaParty) January 23, 2023
ఛలో కొండగట్టు!!
రేపు (జనవరి 24న) జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన "వారాహి" వాహన పూజ జరిపించేందుకు కొండగట్టులో పర్యటించనున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan pic.twitter.com/BtIEPEDX5F
— JanaSena Party (@JanaSenaParty) January 23, 2023