Somesh Kumar: ఏపీకి సోమేశ్ కుమార్.. తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారి!
Somesh Kumar to Report AP CS: DOPT ఆదేశాలు మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లో విధుల్లో చేరనున్నారు. హైకోర్టు తీర్పు, డీవోపీటీ ఉత్తర్వుల మేరకు ఆ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి తన జాయినింగ్ రిపోర్టు ఇవ్వనున్నారు సోమేశ్ కుమార్. తెలుగు రాష్ట్రాల విభజన జరిగి ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సర్వీసులో ఉన్న సోమేశ్ కుమార్ వివిధ హోదాల్లో పనిచేసి ఇప్పుడు సీఎస్ కూడా అయ్యారు. అయితే ఆయనకు హైకోర్టు షాక్ ఇచ్చిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతలు తీసుకుంటూ ఏ స్థాయిలో పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చిన చేయడానికి సిద్ధమైనట్లు వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఇక సోమేశ్ కుమార్ పదవీకాలం ఈ ఏడాది చివరి వరకు ఉండడంతో సంవత్సర కాలాన్ని వృధా చేసుకోకుండా ప్రస్తుత ఏపీ చీఫ్ సెక్రటరీ ఏ బాధ్యతలు అప్పజెప్పిన విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డీవోపీటీ విధించిన డెడ్‌లైన్‌కు అనుగుణంగా గురువారంలోగా అక్కడ జాయిన్ కావాల్సి ఉండగా రేపు ఉదయమే అక్కడకు వెళ్ళి సీఎస్ జవహర్‌రెడ్డికి రిపోర్టు చేయనున్నారని అంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సీఎంఓ నుంచి జీఏడీకి ఆదేశాలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది.