Somesh Kumar: ఇంకా తెలంగాణ సీఎస్ గానే సోమేశ్ కుమార్?
Somesh Kumar Still as Telangana CS: ఇంకా తెలంగాణ సీఎస్ గానే సోమేశ్ కుమారే ఉన్నారా? అదేంటి ఇప్పటికే శాంతి కుమారి తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించగా ఇంకా ఆయనే ఉండడం ఏమిటి? అనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే. నిజానికి తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఎట్టకేలకు ఏపీకి చేరుకున్నారు. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఆయన తక్షణమే ఆంధ్రా వెళ్లిపోవాలని కోర్టు తెలపడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విజయవాడ చేరుకున్న ఆయన సీఎం జగన్ ను కూడా కలిశారు. తెలంగాణ సీఎస్ గా రిలీవ్ అయిన తరువాత ఆయన వీఆర్ఎస్ తీసుకుంటారని వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అలా ఆయన తీసుకున్నాక తెలంగాణ ప్రభుత్వంలోనే సలహాదారు పోస్టు ఇచ్చి సీఎం కేసీఆర్ ఆయనను పక్కనే పెట్టుకుంటారని అనుకున్నా సోమేశ్ కుమార్ మాత్రం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా విజయవాడ చేరి ఏపీ ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆయన పోస్ట్ ఏంటీ..? అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే ఇదిలా ఉండగా ఆయన పేరును ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి తొలగించలేదు. దీంతో ఆయనే ఇంకా తెలంగాణ సీఎస్ గా ఉన్నారా? అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.