Badrdri Temple: మొదలైన భద్రాద్రి రామయ్య కల్యాణ ఏర్పాట్లు
Badrdri Temple: సీతారామస్వామి సన్నిధిలో వసంతోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి..శ్రీరామనవిమి సందర్భంగా నిర్వహించే సీతారాముల కల్యాణంలో వినియోగించే తలంబ్రాల తయారీకి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ నెల 22నుంచి ఏప్రిల్ 5 వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 30న జరగనున్న సీతారాముల కళ్యాణానికి రోలు రోకలికి పూజలు చేసి ముత్తైదువులతో పసుపు కొమ్ములు దంచి పసుపు తయారు చేసి మహిళలు కళ్యాణ తలంబ్రాలను కలిపారు. అనంతరం డొలోత్సవం, వసంతోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్థానిక మిథిలా ద్వారం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాలతో భద్రాద్రి రామయ్య కల్యాణంలో వినియోగించే తలంబ్రాల తయారీని ప్రారంభించారు. పసుపు, కుంకుమ, గులాలు, అత్తరులు, సుగంధ ద్రవ్యాలతో భక్తులు కల్యాణ తలంబ్రాలను కలిపారు. తొలి రోజు 20 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశారు. ఈ నెల 30న జరిగే సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు ఆలయ అధికారులు.