సినీ నటుడు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలపై రాహుల్ స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలనీ స్పష్టం చేశారు.
Rahul Sipligunj: సినీ నటుడు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) రాజకీయాల్లోకి (Politics) ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ (Congress) తరుపున అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గోషామహల్ నుంచి పోటీ చేయనున్నారని.. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా రాహుల్ సిప్లిగంజ్‌కు టికెట్ ఇచ్చేందుకు పచ్చ జెండా ఊపిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ ఇచ్చారు. అసలు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనే తనకు లేదన్నారు. కొద్దిరోజులుగా తాను గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నానంటూ ప్రచారం జరుగుతోందని.. అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. తాను సంగీత రంగంలోనే కొనసాగాలనుకుంటున్నానని రాహుల్ చెప్పారు. సినీ ఇండస్ట్రీకి మరింత సేవ చేయాలనుకుంటున్నానని వివరించారు.
అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులపై తానకు అమితమైన గౌరవం ఉందన్న రాహుల్.. తాను ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీని కూడా సంప్రదించలేదని తెలిపారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను నమ్మకూడదని సూచించారు.
We think there will be RUMOURS but this RUMOUR has become a little bit too much!
PLEASE DO READ THIS🙏🏻 pic.twitter.com/x3buvUN7Bz— Rahul Sipligunj (@Rahulsipligunj) August 25, 2023