hundred days complete: 100 రోజులు పూర్తి చేసుకున్న షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా సంకల్ప యాత్ర తెలంగాణలో విజయవంతంగా కొసాగుతోంది. నేటితో షర్మిల చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. షర్మిల పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కోదాడలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు షర్మిలను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తనను చూసేందుకు వచ్చిన జనానికి అభివాదం చేస్తూ షర్మిల పాదయాత్ర చేపట్టారు. జనంతో కలిసి నడిచారు.
షర్మిల పాదయాత్రను ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సమయంలో షర్మిల ఇరు ప్రభుత్వాలకు లేఖలు రాసి ఘాటుగా విమర్శించారు. షర్మిల యాత్ర వల్లే సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదల చేశారని గతంలో చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో పోటీచేయని ..రానున్న ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.