తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ(BRS And BJP) మధ్య రహస్య దోస్తీ (Secret friendship )నడుస్తోందని కాంగ్రెస్(Congress alleges) ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. పైకి విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నా.. లోలోపల మాత్రం ఇద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోందని చెబుతోంది.
BRS and BJP : తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ(BRS And BJP) మధ్య రహస్య దోస్తీ (Secret friendship )నడుస్తోందని కాంగ్రెస్(Congress alleges) ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. పైకి విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నా.. లోలోపల మాత్రం ఇద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోందని చెబుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎదగనీయకుండా చేసేందుకే.. ఢిల్లీ బీజేపీ(Delhi BJP) పెద్దల ఆదేశాలతో సీఎం కేసీఆర్ (CM KCR)ఇక్కడ ప్లాన్ అమలు చేస్తున్నారని మండిపడుతోంది. దీనికి సాక్ష్యంగా తాజాగా ఖమ్మంలో(Khammam) అమిత్ షా నిర్వహించిన సభను చూపెడుతోంది.
జులై 2న ఖమ్మంలో నిర్వహించిన సభకు కేసీఆర్ సర్కారు అనేక ఆటంకాలు కల్పించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సభకు జనసమీకరణ కోసం 350 బస్సులు అద్దెకు కావాలని ఆర్టీసీకి రిక్వెస్ట్పెట్టగా అధికారులు తిరస్కరించారని గుర్తుచేశారు. సత్తుపల్లి డిపోలోని ఆర్టీసీ అధికారులైతే ముందు అడ్వాన్స్ తీసుకొని తర్వాత వెనక్కి తిరిగి ఇచ్చారని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ఖమ్మంలో నిర్వహించిన కేసీఆర్ సభకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్జిల్లాల పరిధిలోని ఆర్టీసీ డిపోల నుంచి పెద్దసంఖ్యలో బస్సులను తరలించిన ఆర్టీసీ, కాంగ్రెస్ సభకు మాత్రం సరిపడా బస్సులు లేవని చెప్పారని మండిపడ్డారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక సందర్భంగా జులై 2న ఖమ్మంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాహుల్‌గాంధీ హాజరైన ఈ సభకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్లాన్ చేశారు. ఇందుకు తగినట్లే ఆయన అనుచరులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే పబ్లిక్‌ను తరలించేందుకు 350 ఆర్టీసీ బస్సులు కావాలని డిపోల చుట్టూ తిరిగారు. మొదట్లో బస్సులు అద్దెకిస్తామన్న కొత్తగూడెం ఆర్టీసీ అధికారులు ఒక్కో బస్సుకు రూ.25వేల చొప్పున చెల్లించాలని రేటు కూడా చెప్పారు. తీరా సభ నిర్వహించే రోజు మాట మార్చారు. సరిపడా బస్సులు లేనందున కేటాయించలేమని చెప్పారు. ఇక సత్తుపల్లి డిపోలో అంతకు ముందు కట్టిన అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇచ్చేశారని పొంగులేటి అనుచరులు చెప్పారు.
అయితే.. తాజాగా ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన సభకు మాత్రం ఆర్టీసీ బస్సులను కేటాయించారు. దీంతో బీజేపీ సభలకు బస్సులను కేటాయించి, తమకు కొన్ని బస్సులు కూడా కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కారణంగానే బస్సుల కేటాయింపు జరిగిందని.. ఈ వ్యవహారంతో ఈ రెండు పార్టీల సీక్రెట్ ఫ్రెండ్‌షిప్ మరోసారి బయటపడిందని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. రెండు పార్టీల మధ్య ఎప్పటినుంచో స్నేహం కొనసాగుతోందని.. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ.. అంటూ ప్రచారం చేస్తున్నారు.