TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ (TS EAMCET) విద్యార్థులకు అలర్ట్. ఫలితాల (Results) విడుదలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ (Update) ఇచ్చారు.
TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ (TS EAMCET) విద్యార్థులకు అలర్ట్. ఫలితాల (Results) విడుదలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ (Update) ఇచ్చారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గరువారం ఉదయం 9.30 గంటలకే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించాల్సి ఉండగా.. పలు అనివార్య కారణాల స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.
ఉదయం 9.30 గంటలకు జవహర్లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి (Sabitha Indra Reddy) ఫలితాలు ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. ఇకపోతే ఈనెల మే 10, 11 తేదీల్లో ఎం సెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు.. 12 నుంచి 15 వరకు ఆరు విడుతల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. ఎం సెట్ ఇంజినీరింగ్ పరీక్షకు తెలంగాణతో పాటు ఏపీ నుంచి దాదాపు 2లక్షల మంది, అగ్రికల్చర్ పరీక్షకు దాదాపు లక్ష మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను అధికారులు విడుదల చేశారు. అనంతరం విద్యార్థుల నుంచి అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు.