గవర్నర్‌కు రేవంత్ రెడ్డి లేఖ
గవర్నర్ తమిళి సైకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ పరిధిలో మెడికల్ సీట్ల దందాలో ఎలాంటి వారు ఉన్నా ఉపేకించేది వద్దన్నారు. వారిపై చర్యలు తీసుకొవాలన్నారు. గవర్నర్‌గా మీకు ఉన్న అధికారం ఉపయోగించి వైస్ ఛాన్స్‌లర్‌తో మాట్లాడి మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు బ్లాక్ చేసి పలువురు అవినీతికి పాల్పడుతూ కోట్లు దండుకుంటున్నారన్నారు. ఆ దందాలో రాష్ట్ర మంత్రులు కూడా ఉండటం దారుణమన్నారు. మంత్రి మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ దందాకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
నీట్‌లో ఉన్న చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రతీ సంవత్సరం వంద సీట్లను బ్లాక్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ కలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేయించి, సీట్లు కేటాయింపు చేయడం, కౌన్సిలింగ్ అనంతరం అవే సీట్లను బ్లాక్ చేసి ఇతరులకు రెండు నుంచి మూడు కోట్లకు అమ్ముకుంటాన్నారని లేఖలో పేర్కొన్నారు.