Revanth Reddy: బీజేపీ, బీఆరెస్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈడీ అనుకుంటే గంట లోపే కవితను జైలుకు పంపొచ్చు అని పేర్కొన్న ఆయన బీజేపీ, బీఆరెస్ ఎందుకీ డ్రామాలు చేస్తున్నాయి ? అనే విషయం అర్ధం కావడం లేదని అన్నారు. కవిత, సంతోష్, హరీష్, కేటీఆర్ దగ్గర లక్ష కోట్ల సంపద ఉందని పేర్కొన్న ఆయన కవితను ఏమైనా పేరంటానికి పిలుస్తున్నారా? అని ప్రశ్నించారు. కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తాడని, బిఅర్ఎస్ ఆందోళనతో బీజేపీ కూడా రోడ్డెక్కుతుందని అన్నారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని పేర్కొన్న ఆయన కవితను జైల్లో వేయడానికి ఇంత సేపా..? ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాత్మక డ్రామా అడుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలను, ఆదానిపై హిండర్సన్ నివేదికను పక్కదారి పట్టించేందుకు బీజేపీ సిసోడియా ఎపిసోడ్ ని బిఆర్ఎస్ తెరపైకి తెచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.