Revanth Reddy : లిక్కర్ స్కాం వ్యవహారం పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: లిక్కర్ స్కాం వ్యవహారం పై మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలని అన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని పేర్కొన్న ఆయన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా పట్ల వ్యవహరించనట్లు.. లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడంలేదు? అని ప్రశ్నించారు. ఇదంతా ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని పేర్కొన్న ఆయన అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు.
ఈ ఇష్యూపై మౌనంగా ఉంటున్న కేసీఆర్ బండి సంజయ్ కి కనిపించడం లేదా? బండి సంజయ్ , కిషన్ రెడ్డి పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దని అన్నారు. కేసీఆర్ అవినీతిపై నేను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని, కేంద్ర మంత్రులు చెప్పారని, అయినా కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేపట్టలేదు అని ఆయన ప్రశ్నించారు. ఇక మీకున్న కుమ్మక్కు రాజకీయాలు ఏమిటి? అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి బండి సంజయ్ వ్యవహారం గురవిందగింజ చందంగా ఉందని అన్నారు. ఇక బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ పై పోటీ చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గతంలో పోటీ చేసిన సంజయ్.. ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోతే బండి సంజయ్ కి, బీఆరెస్ మధ్య చీకటి ఒప్పందం ఏమిటో ప్రజలు గుర్తిస్తారని అన్నారు.