Revanth Reddy: ఎవరు చేసినా అవి హాత్ సే హాత్ జొడో యాత్ర లే.. తప్పేం లేదు!
Revanth Reddy: తెలంగాణ గవర్నర్ ఫక్తు రాజకీయ నాయకురాలుగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ పరిధిలో ఉన్నాయన్న ఆమె అందరూ అధికారులను పిలిచి మాట్లాడవచ్చని అన్నారు. సమీక్ష చేసి సస్పెండ్ కూడా చేయొచ్చని Dopt కి రికమాండ్ చేస్థే చాలని, సీఎస్ మీద అయినా చర్యలు తీసుకోవచ్చని అన్నారు. గవర్నర్ మొన్ననే అసెంబ్లీ లో ఎవరూ పొగడనంత పొగిడారని అన్నారు. పొడు భూములపై ఎంతో మందిపై దాడి చేశారన్న ఆయన గవర్నర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిర్ణయం తీసుకోవాల్సిన రోజు.. గవర్నర్.. ప్రభుత్వం ఒక్కటి అవుతున్నారని అన్నారు. మిగిలిన రోజుల్లో డ్రామా రక్తి కట్టిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, ఏకగ్రీవం అవ్వడానికి బీజేపీ సహకరించిందని అన్నారు.
ఎంఐఎం గెలుపు కోసం బీజేపీ సహకరించింది, పరోక్ష సహకారం అందించిందని అన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం ప్రత్యక్ష అవగాహనలో ఉన్నాయని అన్నారు. దీనికి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్న ఆయన ఎంఐఎంకి సహకారం చేసింది బీజేపీ…సమాదానం చెప్పాలన్నారు. ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని అన్నారు. ఎవరు చేసినా అవి హాత్ సే హాత్ జొడో యాత్ర లే అని, ఉత్తమ్ చేసినా..మహేశ్వర్ రెడ్డి చేసినా తప్పేం లేదన్నారు. చేయకపోతే చర్యలు ఉంటాయని అందరూ చేయాల్సిందేనని పేర్కొన్న ఆయన చేయని వారిపై పార్టీ సమీక్ష చేస్తుంది.. చర్యలు తీసుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్ తో కలవడం ఏంటి? దోపిడీ పార్టీ అది, బీఆర్ఎస్, బీజేపీ వేరు వేరు కాదని పేర్కొన్న ఆయన అన్నిటిలో కలిసే ఉన్నారు ఇద్దరూ అని అన్నారు.