Revanth Reddy: పైలట్ రోహిత్ మధ్యవర్తిగా కాంగ్రెస్ కొనుగోళ్ళు?
Revanth Reddy Allegations: కర్ణాటకలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండ్రోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశం మీద ఆదివారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు రేవంత్. తాను ఆరోపించిన ఈ విషయం మీద ఈ ఇప్పుడు ఆధారాలు కూడా బయటకు వచ్చాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అందుకు మధ్యవర్తిత్వం వహించారని కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ కు వెళ్లిన రోహిత్ రెడ్డి మళ్లీ మోసం చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు.
అమ్మడం కొనడం పైలెట్ రోహిత్ రెడ్డి కి అలవాటుగా మారిందన్న ఆయన కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నమ్మదని ఆయన అన్నారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా స్పందించారు. ఈ విషయమై వాస్తవాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని ఆయన పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఇక వచ్చే ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో బీఆర్ఎస్, జేడీఎస్ లు కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటన రోజున, ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం రోజు కూడా కుమారస్వామి పాల్గొన్నా మొన్నటి ఖమ్మం సభలో మాత్రం ఆయన కనిపించలేదు. ఈ క్రమంలో కేసీఆర్ మోసం చేయడంతో సభకు రాలేదని కూడా రేవంత్ ఆరోపణలు గుప్పించారు.