Revanth Reddy: కర్నాటకలో కాంగ్రెస్ ను ఓడించడానికి కేసీఆర్ సుఫారీ?
Revanth Reddy on KCR: కేసీఆర్ మోడీకి వ్యతిరేకం అయితే… గుజరాత్ లో ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అఖిలేష్ భార్య పోటీ చేస్తే అఖిలేష్ కి అనుకూల ప్రచారం ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించిన ఆయన ఢిల్లీలో అప్ ను గెలిపించండి అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కేసీఆర్, కేజ్రీవాల్ లిక్కర్ స్కాం భాగస్వాములని, ఆ ఇద్దరూ వ్యాపార భాగస్వాములని అన్నారు. కనీస వ్యాపార భాగస్వామికి కూడా మద్దతు ఎందుకు ఇవ్వలేదు ? అని ఆయన ప్రశ్నించారు. ఈ సభకు మాజీ సీఎం కుమార స్వామి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలి ? చెప్పే అంత ధైర్యం ఉందా అని రేవంత్ ప్రశ్నించారు. సునీల్ కనుగోలు ఆఫీస్ పై దాడి చేసిన తర్వాత కర్ణాటకలో స్మాల్ మార్జిన్ తో కాంగ్రెస్ గెలిచే సీట్ల పై కేసీఆర్ కన్నేశారని, కాంగ్రెస్ నాయకుడిని ఫార్మ్ హౌస్ కి పిలిచి 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు.
కర్నాటకలో కాంగ్రెస్ ను 100 లోపు కె పరిమితం చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అందుకే ఒక కాంగ్రెస్ నాయకుడికి 500 కోట్ల ఆఫర్ ఇచ్చాడని అన్నారు. 20 సీట్లు ఓడేలా కుట్ర చేశారని, పార్టీ అధిష్టానం గమనించి అలెర్ట్ అయ్యిందని అన్నారు. అసలు కర్ణాటకలో కాంగ్రెస్ లో గెలిస్తే నీకు నొప్పి ఏంటి కేసీఆర్? ఇంటెలిజెన్స్ వింగ్ లో 150 మందిని అక్కడికి పంపించారు, అక్కడ కాంగ్రెస్ ను ఓడించడానికి కేసీఆర్ సుఫారీ తీసుకున్నాడని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కు దమ్ముంటే కాదు అని చెప్పమనండి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక కుమార స్వామికి కేసీఆర్ ఈ సమాచారం చెప్పలేదని అందుకే కుమార స్వామి ఈరోజు రాలేదని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడిస్తే ఎవరికి లాభం? బీజేపీకి లాభం చేయడమే కదా? అని అయన ప్రశ్నించారు. మోడీకి, కాంగ్రెస్ కి పోలిక ఏంటి..? చైనా మెడలు వంచింది మేము… భారత భూభాగం సరెండర్ చేశారు మోడీ, పైగా చైనా అక్రమించుకోలేదు అని క్లీన్ చిట్ ఇచ్చాడు మోడీ అంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.