కొంత మంది లక్ష్యాన్ని ముందే నిర్దేశించుకుంటే కొంతమందికి పరిస్థితులు నిర్ణయిస్తాయి.. చేరుకునే మార్గాలు వేరైనా అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే.. యూపీఎస్సీలో విజేతలుగా నిలవడం.. ఒక్కొక్కరిది ఒక్కో కుటుంబ నేపథ్యం.. కష్టాలు ,కన్నీళ్లు ఎన్ని ఎదురైనా వారి అంకితభావం మాత్రం ఒక్కటే అదే సివిల్స్ కొట్టడం.
Telangana Civils Winners: కొంత మంది లక్ష్యాన్ని ముందే నిర్దేశించుకుంటే కొంతమందికి పరిస్థితులు నిర్ణయిస్తాయి.. చేరుకునే మార్గాలు వేరైనా అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే.. యూపీఎస్సీలో విజేతలుగా నిలవడం.. ఒక్కొక్కరిది ఒక్కో కుటుంబ నేపథ్యం.. కష్టాలు ,కన్నీళ్లు ఎన్ని ఎదురైనా వారి అంకితభావం మాత్రం ఒక్కటే అదే సివిల్స్ కొట్టడం. మొదటి అటెంప్ట్ లోనే ఉత్తీర్ణులైనవారు కొంత మంది. అపజయం ఎదురైనా తలవంచక విజయం చేరే వరకు పట్టుదలతో విజయం సాధించినవారు మరికొందరు. గత రెండు మూడేళ్ళలో చూసుకుంటే మన తెలంగాణనుండి ఎంతోమంది ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి ఎంపికయ్యారు.
ఆకునూరి నరేష్ 2021 లో సివిల్స్ లో 117 రాంక్ సాధించాడు. భూపాలపల్లి జిల్లా కాశింపల్లి గ్రామం. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పదోతరగతి వరకు చదివిన నరేష్ సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. గ్రామంలోనే పదవతరగతి వరకు చదువుకుని.. ఇంటర్ హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ కళాశాలలో చదివాడు. ఇంటర్లో మంచి మార్కులు సాధించి.. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసాడు. 2017లో ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. రెండుసార్లు సివిల్స్రాసి విఫలమయ్యాడు. మూడోసారిప్రయత్నంలో ఏకంగా 117 ర్యాంక్ సాధించాడు.
Naresh
సివిల్స్ సాధించాలంటే మొండిగా కూర్చొని చదవాలి. అలా అని ఎక్కువసార్లు ఎక్కువ సమయం అంతా దానికే కేటాయించొద్దు. ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకొని దానిని పూర్తి చేయాలి. యూపీఎస్సీ మన నుంచి ఏం డిమాండ్ చేస్తుందో తెలుసుకొని, ఆ వైపుగా ప్రిపరేషన్ ఉండాలంటుంది బొక్క చైతన్యరెడ్డి 2021 లో 161వ ర్యాంక్ సాధించారు. సూర్యాపేట జిల్లా నూతకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన చైతన్య రెడ్డి 2016లో ఏఈగా జాబ్ సంపాదించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే. సివిల్స్‌కు కోచింగ్ తీసుకుని మంచి మార్కులతో 161 ర్యాంక్ సాధించింది.
Chitanya Reddy
ఇక అదే ఏడాదికి చెందిన ఫలితాలలో శరత్‌నాయక్ 374వ ర్యాంక్ సాధించాడు. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా పట్టుదలతో చదివి మంచి ర్యాంక్ సాధించాడు. శరత్నాయక్ది సామాన్యమైన కుటుంబం అమ్మ అంగన్వాడి టీచర్ నాన్న వ్యవసాయం చేసేవారని తెలిపారు.
Sharath Naik
ఎప్పటిలాగానే సివిల్స్ పరీక్షల్లో తెలుగువారు మరోసారి సత్తా చాటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మందికి పైగానే.. మెరుగైన ర్యాంకులు సాధించారు. తెలంగాణలోని నారాయణ్‌పేట్ జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు కుమార్తె ఎన్.ఉమాహారతి జాతీయస్థాయిలో మూడో స్థానంలో నిలవగా.. మంచిర్యాల జిల్లా కర్ణపేట గిరిజన గ్రామానికి చెందిన ఆజ్మీర సాంకేత్‌కుమార్ 35వ ర్యాంకు.. హనుమకొండకు చెందిన శ్రీ సాయి ఆశ్రిత్ 40వ ర్యాంకు సాధించారు. 1022 ఖాళీలను భర్తీ చేయడానికిగాను నిర్వహించిన ఈ పరీక్షల్లో.. మొత్తం 933 మంది క్వాలిఫై అయినట్టు ప్రకటించింది. ఈ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులనూ మహిళలే కైవసం చేసుకోవడం విశేషం.
సివిల్స్‌లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది మూడవ ర్యాంక్ సాధించిన నూకల ఉమాహారతి తెలిపారు. తెలంగాణలోని నారాయణ్‌పేట్ జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు కుమార్తెఉమాహారతి. ఇన్ని సంవత్సరాల నా కష్టానికి ప్రతిఫలం దక్కిందని భావిస్తున్నాను. మా నాన్నే నాకు ఆదర్శం. మార్గదర్శి. ఆయన సూచనలతో, ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించా. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తికాగానే సివిల్ సర్వీసెస్ కు ప్రిపరేషన్ మొదలుపెట్టాను. అయిదో యత్నంలో ఈ ర్యాంక్ సాధించగలిగాను అని తెలిపింది.
Uma Harathi
హన్మకొండకు చెందిన శాఖమూరి అమర లింగేశ్వర్ రావు, పద్మ దంపతుల కుమారుడైన శ్రీ సాయి ఆశ్రిత్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ఫలితాల్లో 40 ర్యాంకు సాధించడం విశేషం. హన్మకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్ లో టెన్త్ క్లాస్ వరకు చదువుకొని, ఇంటర్మీడియట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీ లో, బిట్స్ పిలానిలో బీటెక్ పూర్తి చేశారు.
Ashrith
మంచిర్యాల జిల్లా కర్ణపేట గిరిజన గ్రామానికి చెందిన ఆజ్మీర సంకేత్ కుమార్ సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయి 35వ ర్యాంకు సాధించాడు. సంకేత్‌కుమార్ మొదటిసారి విఫలం కాగా రెం డోసారి పట్టుదలతో చదివి అతడి కలను సాకారం చేసుకున్నాడు. కర్ణపే ట గిరిజన గూడెంలో ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్యను కాగజ్‌న గర్, కామారెడ్డిలో పూర్తి చేశారు. 10వ తరగతి హైద్రాబాద్‌లోని భాష్యం, ఇంటర్మీడియేట్ ఫిట్జీ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం జేఈఈ అడ్వా న్స్డ్ రాసి ఢిల్లీ ఐఐటిలో బీటెక్, ఎంటెక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. జపాన్ దేశంలో ఒక సంవత్సరం రీసెర్చ్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్ లక్ష్య సాధన కోసం ప్రిపేర్ అయ్యాడు. మొదటి సారి విఫలమై కాగా రెండోసారి పట్టుదలతో చదివి ఆల్ఇండియా స్ధాయిలో 35వ ర్యాంకు సాధించాడు.
Sanketh Kumar
కరీంనగర్లో స్కూల్లో చదువుకునే సమయంలోనే అప్పటి కలెక్టర్ సుమితాడావ్రాను స్ఫూర్తిగా తీసుకుని . సివిల్స్‌కు సిద్దమయ్యానని అన్నారు 94వ ర్యాంకు సాధించిన ఆవుల సాయికృష్ణ. మొదటి ప్రయత్నంలో సరైన ర్యాంకు రాకున్నా.. నిరాశ చెందకుండా మరోసారి గట్టిగా ప్రయత్నించి సాధించానని తెలిపాడు.
సోమనపల్లి గ్రామానికి చెందిన తుమ్మల సాయికృష్ణరెడ్డి సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 640 ర్యాంకు సాధించాడు. సోమన పల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డి-సంతోషి దంపతుల కుమారుడైన సాయికృష్ణ రెడ్డి 10వ తరగతి పట్టణంలోని చిన్నమున్షి పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్ హైద్రాబాద్ నారాయణలో పూర్తి చేశాడు. ఎంసెట్‌లో ర్యాంకు సాధించి ఎన్ఐటీలో సీటు సాధించి బీటెక్ పూర్తి చేశాడు. ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ సివిల్స్‌లో రెండో సారి 640 ర్యాంకు సాధించాడు.