Republic Day: కోర్టు ఆదేశాలిచ్చినా రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు?
Republic Day at Raj Bhavan: తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను ఇప్పటికే ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఇప్పటి వరకు వేచి చూసిన రాజ్ భవన్ అధికారులు చివరికి రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నట్లుగా మీడియాకు సమాచారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం వస్తుందేమో అని ఇప్పటివరకు ఎదురు చూశారు అధికారులు. కోర్టు ప్రభుత్వాన్ని అధికారికంగా కార్యక్రమం నిర్వహించమని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూడాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించడంతో ఈ మేరకు ఇప్పటి వరకు ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాని నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటలకు రాజుభవన్ లోనే గవర్నర్ తమిళిసై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఆ తర్వాత ఆమె ప్రత్యేక విమానంలో పాండిచ్చేరి వెళ్లనున్నారు. ఇక తెలంగాణ రాజ్ భవన్ లోనే పెరేడ్ కూడా జరగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వాన్ని కార్యక్రమాలు నిర్వహించమని కోర్టు ఆదేశించాక కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ నేరం అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.