Renuka Chowdary: కారణం లేకుండా పాదయాత్ర ఆపమానరు.. ఏదో ఉందంటున్న రేణుకా చౌదరి!
Renuka Chowdary: పాదయాత్ర అందరూ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి పేర్కొన్నారు. ఇక్కడ పోటీ యాత్రలు లేవని పేర్కొన్న ఆమె మహేశ్వర్ రెడ్డిని ఠాక్రే కారణం లేకుండా ఆపమని అనరని పేర్కొన్నారు. ఏదో కారణం ఉంటేనే అపమంటారని ఆమె అన్నారు. ఇక కోమటిరెడ్డి రోజుకు ఒకటి మాట్లాడతారని, అసలు అయినా ఈ పాదయాత్రకు పిలవడం ఏంటి ? ఇదేమైనా ఇంట్లో పేరంటమా అని ఆమె ప్రశ్నించారు. పార్టీ కోసం పని చేయాలి అనుకుంటే పాల్గొనాలన్న ఆమె భట్టి యాత్ర ఖమ్మంలో ముగుస్తుందని అన్నారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు పాదయాత్రల సీజన్ నడుస్తోందనే సంగతి అందరికీ తెలుసు. హైకమాండ్ అనుమతులతో ఎవరి యాత్రలు వాళ్లు చేసుకుంటున్న క్రమంలో ఇప్పటికే రేవంత్‌రెడ్డి ఒక యత్ర చేస్తుండగా దిలాబాద్ టు హైదరాబాద్ అంటూ AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన యాత్రకు మధ్యలోనే బ్రేక్ పడింది. ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో 4 రోజులు మాత్రమే పాదయాత్ర సాగగా ఆయన పాదయత్ర ఆపాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. ఈ విషయం మీదనే రేణుకా చౌదరి కామెంట్ చేశారు.