Telangana: అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్!
Red Alert for few districts in Telangana: తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. పని ఉంటే తప్ప చెరువులు, కుంటలు, వాగులు, వంకల వద్దకు వెళ్ళవద్దని కోరుతున్నారు. విద్యుత్ తీగలతో జాగ్రత్తగా ఉండాలని, వర్షాల తర్వాత పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి చెబుతున్నారు. ఇక ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ భారీ వర్షాల దృష్ట్యా నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక తాజాగా ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదే విధంగా మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.