Rajagopal Reddy: కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు.. రాజగోపాల్ రెడ్డి
Rajagopal Reddy: తెలంగాణలో మునుగోడు ఎన్నికలు కాకముందే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే అంశం తెరపైకి వచ్చింది. వినూత్నంగా టిఆర్ఎస్ గెలిచింది. ఆ ఉపఎన్నికలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మంత్రులు అందరు ప్రచారం చేయడం వల్ల టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ పదకొండు వేల మెజార్టీతో గెలిచాడు. తాజాగా ఆ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ముందస్తు ఎన్నికలగురించి కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
తాజాగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు. నిర్మల్ లో రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకతో పాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. బిజెపి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలిచిందని విమర్శించారు.
తెలంగాణలో బిజెపికి పెరుగుతున్న ఆదరణతో కెసిఆర్ కి ఓటమి భయం పట్టుకుందని రాజగోపాల్ అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. ఆ పార్టీలో బలమైన నాయకులే లేరన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బిజెపిలోకి రావాలని పిలుపునిచ్చారు.