చంచల్‌గూడా జైలుకు రాహుల్ గాంధీ..
రాహుల్ గాంధీ చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్నారు. మాణిక్కం ఠాగూర్ పెట్టిన ధరఖాస్తుకు జైళ్ల శాఖ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జైలుకు రాహుల్‌తో పాటు ఒక్కరు మాత్రమే వెళ్లాలని తెలిపింది. దీంతో చంచల్ గూడ జైలుకు రాహుల్‌తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి విద్యార్థి నేతలను పరామర్శించనున్నారు. మొదటి సారి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిని తిరస్కరించిన జైళ్ల శాఖ అధికారులు.. జైలులో ఉగ్రవాదులు ఉన్నారని, భద్రత దృష్యా రాహుల్ గాంధీకి అనుమతి లేదని తెలిపింది. అయితే మరోసారి పెట్టుకున్న ధరఖాస్తుకు షరతులతో కూడిన అంగీకారం తెలిపింది.
మరోవైపు రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుపోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు. ఓయూలో రాహుల్ టూర్‌పై కాంగ్రెస్ నేతలు హైకోర్టులో రెండు సార్లు పిటిషన్ వేశారు. న్యాయస్థానం రాహుల్ ఓయూ పర్యటన.. యూనివర్సిటీ వీసీ చేతుల్లో ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతో కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.