తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుపై ప్రజా బ్యాలెట్…
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచి కరోనాతో అర్థికంగా నష్టపోయిన పేద, మధ్య తరగతి ప్రజలను సీఎం మరింత పేదలుగా మార్చాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రజా బ్యాలెట్ ఏర్పాటు చేస్తామన్నారు. బషీర్ బాగ్ నుంచే ప్రజా బ్యాలెట్ ప్రారంభం అవుతుందని బండి సంజయ్ తెలిపారు.
కరెంట్ ఛార్జీల పెంపుపై రాష్ట్రంలో దశల వారిగా ఆందోళనలు చేస్తామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై మొదట ప్రజా బ్యాలెట్ చేపడుతామన్న సంజయ్.. తర్వాతి దశలోగ్రామ పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు ధర్నాలు, ఆందోళనలు చేపడుతామని, రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలను తగ్గించేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు.