KTR: ప్రీతి మరణాన్ని కూడా రాజకీయం చేస్తారా, విపక్షాలపై కేటీఆర్ ఫైర్
Preethi’s family will be taken care, Minister KTR Promises
మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. హన్మకొండ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రీతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కారణంగా ప్రీతి చనిపోవడం బాధాకరమని అన్నారు. ఈ విషయాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
పనికిరాని పాదయాత్రలు
మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయ నిరుద్యోగులు పనికిరాని పాదయాత్రలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. చందమామలో మచ్చలను చూపెట్టినట్టు కేసీఆర్ పాలనలో పూర్తి కాని పనులు చూపెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని కేటీఆర్ అన్నారు. హంతకుడే సంతాపం చెప్పినట్టు రేవంత్ రెడ్డి మాటలున్నాయని కేటీఆర్ అన్నారు.
50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే గుడ్డి గుర్రం పండ్లు తోమారా? అంటూ ప్రశ్నించారు.అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయని కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ఒక్క చాన్స్ అని అడగడం అవివేకమని అన్నారు.నాలుగు కోట్ల ప్రజలతో కూడిన వసుధైక కుటుంబ పాలన మాది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మతం పేరుమీద మంటలు, కులం పేరుమీద కుంపట్లు
కిషన్ రెడ్డి మెదడు మోకాళ్ళలో ఉందా? అరికాళ్ళలో ఉందా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మోడీని దేవుడితో పోల్చుతూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. మోడీ ఎవ్వలకు దేవుడు? ఎందుకు దేవుడు? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతున్నందుకు దేవుడా? అని ప్రశ్నించారు. అదానీకి దేవుడు కావచ్చని అన్నారు.హిందు, ముస్లిం తప్ప బీజేపీకి మరోటి తెలియదని కేటీఆర్ అన్నారు. మతం పేరుమీద మంటలు, కులం పేరుమీద కుంపట్లు పెడుతున్నారని మండిపడ్డారు.
కులం పంచాయతీ లేదు… మతం పిచ్చి లేదు
జనహితమే మా అభిమతం : మంత్రి శ్రీ @KTRBRS. pic.twitter.com/PM8sWb8ABT
— BRS Party (@BRSparty) February 27, 2023