Preethi Death Case: ప్రీతి మరణంపై సోదరుడు పృధ్వీ సందేహాలు, ప్రశ్నలు..
Preethi Brother expresses doubts over Preethi’s death
మెడికల్ స్టూడెంట్ ప్రీతి సోదరుడు పృథ్వీ సంచలన విషయాలు బయటపెట్టాడు. తనకు తెలిసిన కొన్ని విషయాలను వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. తన సోదరిని సైఫ్ చాలా సార్లు ఇబ్బంది పెట్టాడని, వీరిద్దరికీ కలిపి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పిందంతా పూర్తి అబద్ధమని స్పష్టం చేశాడు. సైఫ్ అనే వ్యక్తి పూర్తిగా సపోర్టుగా నిలిచిన నాగార్జునరెడ్డితో కమిటీ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించాడు.
బ్లడ్ డయాలిసిస్
నిమ్స్ ఆసుపత్రిలో ప్రీతి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని పృధ్వీ తెలిపాడు. ఆ సర్జరీ ఎందుకు చేశారనేది తెలియడం లేదని తెలిపాడు. అదే విధంగా ప్రీతి చేతిపై గాయం ఉందని కూడా పృధ్వీ వెల్లడించాడు. ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలిసిస్ చేశారని తెలిపాడు.
ప్రీతి సోదరి పూజ ఆరోపణలు
కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి మరణం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఐదు రోజులుగా చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి మృతి చెందింది. ప్రీతి మృతిపట్ల ఆమె అక్క పూజ అనేక సంచలన వ్యాఖ్యలు చేసింది.తమ సోదరి మృతి మీద అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. సీనియర్లు, ప్రీతి బ్యాచ్ మేట్స్ అందరూ కలిసి తన చెల్లిని ఒంటరి చేసి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రీతి బ్యాచ్ మేట్స్ అందరూ విడిగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని.. అందులో తన చెల్లెలి గురించి కించపరిచేలా పోస్టులు పెట్టేవారని తెలిపింది. సీనియర్లు, తోటి పీజీలు అంతా ఒక్కటై… తన చెల్లిని ఇబ్బంది పెట్టారని.. దీనిమీద కాలేజీ ప్రిన్సిపాల్ కి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రీతి సోదరి పూజ ఆవేదన వ్యక్తం చేసింది.