Ponnala Lakshmaiah: కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లో ఉంది.. పొన్నాల లక్ష్మయ్య
Ponnala Lakshmaiah: కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే సీఎం కేసీఆర్ కొత్తనాటకానికి తెరలేపాడని ఆరోపించారు. హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామని..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. సిద్దిపేటలో రమేష్ అనే వ్యక్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
ఇల్లు కోసం ఒక సాధారణ గిరిజనుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే.. రాష్ట్ర పాలన అధ్వానంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ఇలాకాలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలావుందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. కరెంట్ కొనుగోలు అంతా దోపిడీ మయంగా మారిందన్నారు. మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నదని ఈ సందర్బంగా పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేసాడు.