Ponguleti: పొంగులేటి యూ-టర్న్.. హస్తం గూటికి?
Ponguleti Srinivasa reddy U-turn: ఖమ్మం జిల్లా రాజకీయాలు కేవలం ఖమ్మం జిల్లా వరకే కాదు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని నేషనల్ లెవల్లో లాంచ్ చేసిన తర్వాత భారీ బహిరంగ సభ ఖమ్మంలోనే ఏర్పాటు చేశారు. ఒక రకంగా ఖమ్మం మీదనే ఎక్కువ దృష్టి ఉంది అని చెప్పకనే చెప్పారు. అంతలా కేసీఆర్ ఖమ్మం జిల్లా మీద కాన్సంట్రేట్ చేస్తుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలకు తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఆయనకు, ఆయన అనుచరులకు వచ్చే ఎన్నికల్లో అడిగిన చోట టికెట్లు ఇవ్వకపోవచ్చు అనే అంచనాల నేపథ్యంలో ఆయన పార్టీకి దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన కూడా బీజేపీ నేతలకు టచ్ లో వెళ్లినట్టు తేలడంతో దాదాపుగా ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయం అనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో చీఫ్ రేవంత్ రెడ్డి చక్రం తిప్పినట్లు సమాచారం. పొంగులేటిని కలిసి తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అందులో భాగంగానే కాంగ్రెస్ కార్పొరేటర్లు పొంగులేటిని కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది.