Ponguleti Srinivasa Reddy: అభిమానుల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుంటా
Ponguleti Srinivasa Reddy: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిగులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. సంక్రాంతి తర్వాత పార్టీ మారనున్నారా? కాషాయ కండువా కప్పుకోనున్నారా? అంటే తాజా రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. ఆయన పార్టీ మారే అంశంపై బీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. జనవరి 1న కార్యకర్తలు, అభిమానులతో భారీ బల ప్రదర్శన చేసిన పొంగులేటి.. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
సంక్రాంతి తర్వాత ఢిల్లీ లో ఆయన ప్రధాని మోడీ , అమిత్ షా సమక్షంలో బిజెపి కండువా కప్పుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను చూసి చాలామంది నిజమే అనుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో పొంగులేటి..బిజెపి లో చేరడం ఫై క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరాల్సి వస్తే.. దొంగచాటుగా కండువా కప్పుకోనని, ఢిల్లీ నడిబొడ్డున లక్షల మంది అభిమానుల సమక్షంలో కండువా కప్పుకుంటానంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ను వీడాల్సి వస్తే బహిరంగంగా ప్రకటిస్తానన్నారు.
2018 ఎన్నికల నుంచి ఇప్పటివరకు బీఆర్‌ఎస్ లోనే కొనసాగుతున్నా అధిష్ఠానం సరైన గౌరవం ఇవ్వడం లేదని పొంగులేటి పలుమార్లు చెప్పకనే చెబుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చిన వారిని కాకుండా తన వర్గం వారిని గెలిపించుకోవడంతో పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క సీటు దక్కింది. దీనిపై ఆయన అసంతృప్తి తో తో ఉన్నారు.