Ponguleti: పార్టీ మార్పు ఖాయమే.. అవమానాలంటూ పొంగులేటి అనుమానాలు!
Ponguleti Sreenivasa Reddy Comments on Party Change: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్లు చేసారు. చేప నీళ్లలో ఉండటం ఎంత సర్వసాధరణమో అది ఓడ్డు కి వస్తే చనిపోతుందనేది కూడా అంతే సాధారణం అని అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాజకీయ నాయకులు ఎవరైనా ప్రజల్లో మమేకం అయి ఉన్నప్పుడే, ప్రజల దీవెనలు ఉన్నప్పుడే రాజకీయ నాయకుడిగా రాణించగలుగుతారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కుటుంబ సభ్యులు ప్రతి ఇంట్లో శ్రీనన్నను ప్రేమిస్తున్నారని, భగవంతుడి దయతో మీ ప్రేమ వట్టిగా పోదని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎమ్ కొరుకుంటున్నారో తప్పకుండా రాబోయే రాజకీయాల్లో అదే జరుగుతుందని ఆయన అన్నారు.
రాబోయే చదరంగం, కురుక్షేత్రంలో తప్పకుండా ఆ కురుక్షేత్రంలో యుద్ధానికి శ్రీనన్న సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించిన పొంగులేటి ఈ సారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని కూడా ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రత తగ్గిస్తూ షాక్ ఇవ్వకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. నిన్నమొన్నటి దాకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న 3+3 భద్రతను 2+2కు ప్రభుత్వం కుదించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధిష్టానానికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య చెడిందని.. పార్టీ ఆయనను దూరం పెట్టిందనే ప్రచారం మొదలవగా ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కూడా కేంద్ర భద్రత కల్పిస్తున్నామని పేర్కొనడం కూడా హాట్ టాపిక్ అయింది. తాజాగా పొంగులేటి చేసిన కామెంట్స్ కూడా.. ఆ వార్తలకు బలం చేకూర్చి నట్టుగా నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని అనడంతో త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.