PM Tour : ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ వాయిదా..
PM Modi’s Scheduled Hyderabad Tour Postponed:; ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ కు రావాల్సి ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. అదే సమయంలో సికింద్రబాద్ నుంచి విశాఖ వరకు తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు అయింది. దీంతో పాటుగా సికింద్రాబాద్ స్టేషన్ రీ డెలప్ మెంట్ వర్క్స్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని అధికారులు వెల్లడించారు. ప్రధాని కర్ణాటక గుల్బర్గా నుంచి హైదరాబాద్ చేరుకొనేలా షెడ్యూల్ తొలుత ఫిక్స్ చేసారు.
ఇప్పుడు ప్రధాని పర్యటన వాయిదా పడినట్లుగా సమాచారం అందింది. తిరిగి ప్రధాని పర్యటన ఎప్పుడు ఉంటుదనేది స్పష్టత రావాల్సి ఉంది. మరోసారి ప్రధాని పర్యటన వరకు వందేభారత్ ప్రారంభం వాయిదా వేస్తారా, లేక నిర్ణయించిన ముహర్తానికే వర్చ్యువల్ విధానంలో ప్రారంభిస్తారా అనేది ప్రధాని కార్యాలయంలో ఉన్నతాధికారులు సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ప్రధాని వర్చ్యువల్ విధానంగా ప్రారంభోత్సవాలకు అంగీకరిస్తే రూ 699 కోట్ల అంచనాతో నిర్ణయించిన సికింద్రాబాద్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. రూ 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సికింద్రబాద్ – విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ పైన రెండు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకుల్లో ఆదరణ కనిపిస్తోంది. ఈ రైలు అందుబాటులోకి రావటం ద్వారా దరంతో కంటే వేగంగా 8.40 గంటల్లో సికింద్రబాద్ నుంచి విశాఖ చేరుకొనే వెసులుబాటు కలుగుతుంది.