పీయూష్ గోయల్ ది కండకావరం. ఖబడ్దార్!
ద్ర ప్రభుత్వంపై మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్ గోయల్ తెలంగాణను అవమానించారన్నారు. రాష్ట్ర సమస్యలు చెప్పడానికి కేంద్ర మంత్రి వద్దకు వెళ్తే ఆయన తమ మాటలు వినకుండా తమపై దురుసుగా ప్రవర్తించారన్నారు. పండిన పంటను కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం పంచాయతీలు చేస్తుందన్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఏ పంట పండుతుందని, రాష్ట్ర సమస్యలు కేంద్రానికి ఎందుకు చెప్పడంలేదన్నారు.
పియూష్ గోయల్‌ను తాము అనేక సార్లు కలిసి రాష్ట్ర సమస్యల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయన మమ్మల్ని అవమానిస్తూ వచ్చారన్నారు. పియూష్ గోయల్‌తో సమావేశం అయ్యే సమయంలో సమావేశానికి రాని కిషన్ రెడ్డి.. సమావేశం అనంతరం మంత్రి వద్దకు వెళ్లేవారన్నారు. కిషన్ రెడ్డి జీవిత కాలం కేంద్ర మంత్రిగా ఉంటారా అని ప్రశ్నించారు. తెలంగాణ అధికారులు రెండు సార్లు వరిపై కేంద్ర ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరైనా.. పియూష్ గోయల్ మాత్రం సమావేశాలకు తెలంగాణ అధికారులు రాలేదనడం దుర్మార్గమన్నారు. తెలంగాణను అవమానించిన పియూష్ గోయల్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.