పీయూష్ గోయల్ అహంకారంతో మాట్లాడారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్ గోయల్ అహంకారంతో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అనడానికి గోయల్‌కు నోరు ఎలా వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతాన్ని ఒక విధంగా దక్షిణ భారతాన్ని మరో విధంగా చూస్తున్నారన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. ప్రధాని తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ మంత్రులు దద్దమ్మలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు చిల్లర వేషాలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం వరి వేయవద్దని చెబుతే.. బీజేపీ నేతలు మాత్రం ప్రతీ గింజా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు వరి వేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు రోషం, పౌరుషం లేదని ఎద్దేవా చేశారు. పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని పల్లా డిమాండ్ చేశారు.