Etala Rajender:కేసీఆర్ను ఓడించడమే మా టార్గెట్: ఈటల రాజేందర్
TRS, Congress Leaders Joining in Bjp: తెలంగాణలో రానున్న రోజుల్లో చాలా అద్భుతాలు జరగబోతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పుడు రోజులు బాగా లేవన్న ఆయన.. జులై 27 తర్వాత మంచి రోజులు ప్రారంభమౌతాయని, ఆ సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి చాలా మంది సీనియర్ నేతలు బీజేపీలో చేరబోతున్నారన్నారు. తనతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చాలా మంది నేతలు టచ్లో ఉన్నారన్న ఈటల.. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించడమే తమ టార్గెట్ అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంతమైపోతోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి రాలేదన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్లేనన్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరితే వారిని గెలిపించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఫార్ములా ప్రకారం పని చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ను ఎదుర్కొనే సత్తాలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఈటల.. ఆయన కేసీఆర్ మీద కసి తీర్చుకోవాలని చూస్తున్నారన్నారు. అందుకు బీజేపీ మాత్రమే సరైన వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావించారన్నారు.