టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ తో ఎందుకొచ్చిన టెన్షన్ అని భావించిన తెలంగాణ ప్రభుత్వం, ఈడీ అడిగిన అన్ని వివరాలు ఇచ్చేసింది. డిజిటల్ రికార్డ్స్ ,కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈడీకి అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈడీ అడిగిన వివరాలు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ కు మెమో దాఖలు చేసింది ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై హైకోర్టులో ఈడీకోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ప్రభుత్వ మెమోతో కోర్టు ధిక్కరణ పిటిషన్ ను ఈడీ వెనక్కి తీసుకోనుంది. ఈ క్రమంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ మళ్ళీ దూకుడు పెంచనుంది. మరోసారి సినీ తారలను ఈడీ విచారించనుందని అంటున్నారు. ప్రభుత్వం , ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటాను ఈడీ ప్రశీలిస్తోంది. వీటి ఆధారంగా మరోసారి సినీ ప్రముఖుల ను ఈడీ విచారించనుందని అంటున్నారు. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోలు,మనీ ల్యాండరింగ్ అంశాలపై ఈడీ కూపీ లాగనున్నట్టు చెబుతున్నారు.