మునుగోడు ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్లో కొత్త జోష్ నింపుతున్నాయి. జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన కేసీఆర్కు ఈ ఎన్నికల ఫలితాలు శుభారంభంగా నిలిచాయి. ఈ ఫలితాలపై టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ పార్టీదే గెలుపని, యావత్ సమాజం కేసీఆర్ వెంటే ఉంటుందనే విషయం మునుగోడు ఉప ఎన్నికల ఫలితంతో మరోసారి రుజువైందని నామా నాగేశ్వరరావు అన్నారు
మునుగోడు ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్లో కొత్త జోష్ నింపుతున్నాయి. జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన కేసీఆర్కు ఈ ఎన్నికల ఫలితాలు శుభారంభంగా నిలిచాయి. ఈ ఫలితాలపై టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ పార్టీదే గెలుపని, యావత్ సమాజం కేసీఆర్ వెంటే ఉంటుందనే విషయం మునుగోడు ఉప ఎన్నికల ఫలితంతో మరోసారి రుజువైందని నామా నాగేశ్వరరావు అన్నారు. సీఎం కేసీఆర్ భరోసాతో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని సంతృప్తి వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం ముందుగానే ఊహించిందేనని నామా నాగేశ్వరరావు తెలిపారు. మొదటి రౌండ్ నుంచి మంచి ఆధిక్యాన్ని ప్రదర్శించి ఘన విజయంతో విజయకేతనం ఎగురవేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నామా నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్కు పట్టం కట్టిన మునుగోడు ఓటర్లకు అభినందనలు తెలిపారు.
మునుగోడు ఫలితంతో దేశంలో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అయిందని నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వాటిని పటాపంచలు చేసి, టీఆర్ఎస్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని నామా నాగేశ్వరరావు గర్వం వ్యక్తం చేశారు.