Nama Nageshwar Rao: పార్టీ కార్యక్రమాలకు నన్ను పిలవడం లేదు.. నామా సంచలనం!
Nama Nageshwar Rao: పార్టీ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను పిలవడం లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. నన్ను ఎక్కడకు పిలిచిన వచ్చేస్తానని పేర్కొన్న ఆయన నాతో మీకు ఎందుకు గాప్ వచ్చిందో చెప్పండని పార్టీ నేతలతో కామెంట్ చేశారు. ఈ సమస్యకు పార్టీ నాయకులు బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన నామా ఈ మధ్య ఎందుకో గ్యాప్ వచ్చిందని నన్ను ఏ కార్యక్రమానికి పిలవడం లేదని, దానికి బాధ్యత మీరే వహించాలని పార్టీ నేతలతో అన్నారు. ఇక పిలిస్తే ఎక్కడికి రావడానికి అయినా నేను సిద్ధమే అని నామా నాగేశ్వర్ రావు అన్నారు. ఇక ప్రస్తుతానికి నామా ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా సైతం ఎంపీ నామా నాగేశ్వరరావు కీలకంగా ఉన్నారు. అలాంటి ఆయన లోకల్ నేతలతో ఈ మేరకు కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.