Nagam Vs Marri: నాగం కాటేసే పాము..నేను నీడను ఇచ్చే మర్రి చెట్టుని
Nagam Vs Marri: నాగర్ కర్నూల్ జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని మార్కండేయ రిజర్వాయర్ దగ్గర తలెత్తిన ఘర్షణ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ సభను బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న క్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లా ప్రజలకు ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయని నాగం జనార్దన్ రెడ్డి.. ఏ పేరుతో దళిత గిరిజన సభ నిర్వహిస్తున్నారు అని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీకి 21 సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
ఈ క్రమంలోనే నాగం జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు. అసలు జనార్దన్ రెడ్డికి నాపై సవాల్ విసిరి స్థాయి లేదని, అతను బట్టల వ్యాపారి అని అన్నారు. తెలంగాణ కోసం నేను రాజీనామా చేశానని పేర్కొన్న ఆయన ఆనాడు టిడిపి నుంచి పోటీ చేసి తెలంగాణ భావాలను దెబ్బతీశారని అన్నారు. అలాంటి వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఎలా ఇస్తాడు అని ప్రశ్నించారు. ఇక దీనిపై ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి మాట్లాడుడూ నాగం కాటేసే పాము లాంటి వాడని, నేను నీడను ఇచ్చే మర్రి చెట్టు లాంటి వాడినని అన్నారు.
అసలు మీకు కాటేసే…. పాము కావాలా… నీడనిచ్చే చెట్టు కావాలా…? అని ప్రశ్నించిన ఆయన నాగం నీ సవాలు స్వీకరిస్తున్న, ఆరు నెలల్లో ఈ మార్కండేయ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా, చేయకుంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని అన్నారు. మమ్మల్ని తినడానికి అయిదు కోట్ల పెట్టి సభ పెట్టారని పేర్కొన్నఆయన నేను నాగం లెక్క బియ్యం లారీ లు అమ్ముకొలేదని అన్నారు. ఇక గాలి జనార్థన్ రెడ్డి కనుక గాలికి పొయ్యాడు, కాంగ్రెస్ మొత్తం వచ్చిన ఒక్క ఉడ కూడా ఈ మర్రిది పీక లేరని అన్నారు. నన్ను నిన్న రేవంత్ గాడిదను అన్నాడు, అవును గాడిదనే నా ప్రజలు కొసం గాడిద లాగా కష్టం చేస్తానని అన్నారు.