Revanth Reddy: నేనలా అనలేదు నా మాటలను వక్రీకరించారు..రేవంత్ రెడ్డి
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమ్ముడుపోయారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్ చేశారనే వార్తలు దుమారాన్ని రేపాయి. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు తాను చేశానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ లో సీనియర్లు అమ్ముడుపోయారంటూ ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసిందని విమర్శించారు. తాను అనని మాటలను అన్నట్టుగా రాశారని దుయ్యబట్టారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు. ఈ వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు. వార్తలు రాసే విషయంలో మీడియా సంయమనం పాటించాలని అన్నారు. రాజకీయ వివాదాలు సృష్టించి సమస్యలు జటిలం చేయవద్దని కోరారు రేవంత్ రెడ్డి.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కేవలం 25 సీట్లు మాత్రమే వస్తాయని, బీజేపీ 7-8 సీట్లు గెలుచుకునే అవకాశముందని రేవంత్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో రేవంత్ పాదయాత్ర కొనసాగుతోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌కు 150 సీట్లు వచ్చే అవకాశముందని అన్నారు. మిత్రపక్షాలను, కలిసొచ్చే పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని అన్నారు.