Raja Gopl Redddy: అర్థరాత్రి మునుగోడు నియోజకవర్గం చండూరులోని ఆర్వో కార్యాలయం ముందు రాజగోపాల్ రెడ్డి ధర్నాకి దిగారు. నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు మకాం వేసి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ధర్నా చేశారు. చండూర్ ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. తన అనుచరులతో వచ్చి ఆర్వోకార్యాలయానికి వచ్చారు అక్కడ అధికారులు లేకపోవడంతో అక్కడే కూర్చుని ధర్నాకి దిగారు .
ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే మకాం వేశారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోవట్లేదంటూ ధర్నాకు దిగారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక టీఆర్‌ఎస్ నాయకుల ఇళ్లల్లోనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంమ్మెల్సీలు ఉన్నారని తెలిపారు.
ఆర్వోకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోలీసులు పూర్తిగా బిజెపి నాయకులపై వివక్ష చూపిస్తున్నారన్నారు. కేంద్ర బలగాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా గ్రామలలో ఎటువంటి భద్రత రక్షణ పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పక్కనియోజకవర్గం లో ఉన్న ఈటెల రాజేందర్ ను బలవంతంగా పోలీసులు అక్కడనుండి హైదరాబాద్ కి పంపించివేయడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునుగోడు లో స్థానికేతరులు టీఆర్‌ఎస్ నాయకులు,మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటె వారిని పంపించలేక దేవరకొండలో ఉన్న మమల్ని పంపించడం కరెక్ట్ కాదని ఈటెల అన్నారు.