బీజేపీ నేత, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు ( Dharmapuri Arvind) సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ ఫొటో ధర్మపురి అరవింద్‌ని చిక్కుల్లో పడేసింది.
MP Arvind: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫొటోలు, వీడియోలు వైరలవుతుంటాయి. వాటి ద్వారా కొందరు ఓవర్‌నైట్‌లో ఫేమస్ అయితే.. మరికొందరు చిక్కుల్లో కూడా పడ్డారు. ఇలానే బీజేపీ నేత, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు ( Dharmapuri Arvind) సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ ఫొటో ధర్మపురి అరవింద్‌ని చిక్కుల్లో పడేసింది.
ఏం జరిగిందంటే..
ఇటీవల ఎంపీ ధర్మపురి అరవింద్ ( Dharmapuri Arvind) ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అరవింద్ ఇంట్లోనే షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు. ఆ వీడియో యూట్యూబ్‌లో విడుదల చేయగా.. లక్షల సంఖ్యలో వ్యూస్ కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా అరవింద్ ఇంట్లో ఏనుగు దంతాల వంటి వస్తువులు వీడియోలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు దానిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఓ నెటిజన్ ఆ స్క్రీన్ షాట్లను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘బీజేపీ ఎంపీ అయివుండి ఇంట్లో ఏనుగు దంతాలను పెట్టుకొని మీడియా అంటే ఏమాత్రం భయం లేకుండా ఇంటర్వ్యూ ఇస్తున్నావ్.. నీ ఇంట్లోకి ఏనుగు దంతం ఎక్కడి నుంచి వచ్చింది. నువ్వు చేసేది రాజకీయమా?.. లేక వ్యాపారామా?’’ అంటూ నిలదీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ఇక దీనిపై ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ కూడా స్పందించింది. ఎంపీ ధర్మపురిని ట్యాగ్ చేస్తూ.. ‘‘ఇది ఏనుగు దంతాలా? లేక మరి ఏదైనా కళాఖండమా అనేది క్లారిటీ ఇవ్వండి’’ అంటూ ట్వీట్ చేసింది.
Requesting @Arvindharmapuri Hon'ble MP to clarify whether it's an Elephant tusk or some other artifact. @WCCBHQ @HarithaHaram @TelanganaDGP pic.twitter.com/6S1ZSkyjXD
— Forests And Wildlife Protection Society-FAWPS 🇮🇳 (@FawpsIndia) May 21, 2023
BJP పార్టీ MP అయివుండి
నట్టింట్లో ఏనుగు దంతాలను పెట్టుకొని
మీడియా అంటే ఏ మాత్రం భయం లేకుండ
ఇంటర్వూ ఇస్తున్నావ్..నీ ఇంట్లోకి ఏనుగు దంతం ఎక్కడి నుండి వచ్చింది..
నువ్వు చేసేది రాజకీయమా లేక వ్యాపారమా pic.twitter.com/gN2US2ZuJ2— 🇷 🇦 🇲 (@ram_views) May 22, 2023