MP Aravind: తెలంగాణ మంత్రులు ఢిల్లీ రావొద్దు.. అరవింద్ హెచ్చరిక!
MP Aravind: ఢిల్లీలో బీజేపీ ఎంపీ అరవింద్ కేటీఆర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేటీఆర్ కి సంతోష్ జీ అంటే ఎవరో తెలుసా ? కేటీఆర్ కన్నా సంతోష్ జీ బాగా చదువుకున్నాడని అరవింద్ అన్నారు. దేశం కోసం అన్నీ త్యాగం చేసిన వ్యక్తి సంతోష్ జీ అని కోర్టుకు వెళ్లి సంతోష్ జీ ఆర్డర్ తెచ్చుకున్నాడు అని గతంలో కేటీఆర్ అన్నాడు, మరి కవిత కోర్టుకు ఎందుకు వెళ్ళింది? అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కాదు ఏ కోర్టుకైనా వెళ్లడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన అన్నారు. ఫామ్ హౌజ్ కేసులో కోర్టుకు వెళ్లిన కేటీఆర్ కు ఈ విషయం బాగా తెలుసు అన్నారు. పదేళ్లలో దిక్కు మాలిన సంపాదన సంపాదించారని ఆయన అన్నారు. ఇక రేపు కవిత విచారణ ఉందని, మొత్తం కేబినెట్ వేసుకొని కేటీఆర్ మళ్లీ వస్తారేమో అని అన్నారు. కవిత 33 శాతం మహిళా రిజర్వేషన్ కోసం బిల్లు అంటున్నారు, మరి కేసీఆర్ కేబినెట్ లో ఎంతమందికి 33 శాతం ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. మళ్ళీ సీట్లు పాత వారికి ఇస్తా అంటున్నారు, మరి 33 శాతం ఎలా ఇస్తారు? అని అరవింద్ ప్రశ్నించారు. కెసిఆర్ తో ముందు 33 శాతం చేయించి తర్వాత కేంద్రానికి రండని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ మంత్రులకు మళ్ళీ చెప్తున్నా ఊరికే ఢిల్లీకి రాకండి, ఎయిర్ పోర్ట్ లో ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాలు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అన్ని వివరాలు తెలుస్తాయని హెచ్చరించారు.