MLC Kavitha: ఎట్టకేలకు ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ
MLC Kavitha: సుదీర్ఘంగా సాగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ఎట్టకేలకు ముగిసిందని అంటున్నారు. ప్రస్తుతం డాక్యుమెంటేషన్ ప్రక్రియ జరుగుతోందని, కవిత సంతకాలు ఈడి అధికారులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక రాత్రి 8 గంటలకు ఈడి కార్యాలయం నుంచి కవిత బయటకు రానున్నట్టు చెబుతున్నారు. తదుపరి విచారణ పై నిర్ణయం కూడా ఈడి అధికారులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇవాళ కవితను విచారించిన టీమ్ వివరాలు ఉన్నాయి. మొత్తం 5 గురితో కూడిన బృందం ఆమెను విచారించగా అందులో ఈడీకి చెందిన ఒక జాయింట్ డైరెక్టర్, లేడీ డిప్యూటీ డైరెక్టర్, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. దాదాపు 8 గంటలు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారని అంటున్నారు. విచారణ మధ్యలో సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు భోజన విరామ సమయం ఇచ్చి అనంతరం 5గంటలకు తిరిగి విచారణ కొనసాగించారు. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, మనీష్ సిసోదియా స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నిస్తోందని తెలుస్తోంది.