MLA Rajayya: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రాజయ్య!
MLA Rajayya Cried: తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓ చర్చ్ ఫాదర్ బర్త్‌డే వేడుకల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. కేక్ ముందు కూర్చొని బోరున ఏడ్చారు రాజయ్య. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు రాజయ్య. 63 ఏళ్ల వయసున్న తనపై లైంగిక ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. సొంత చెల్లిని, బిడ్డను కూడా ముట్టుకోలేని పరిస్థితి కల్పించారని కన్నీటి పర్యంతమయ్యారు. తనన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని, దమ్ముంటే నాపై పోటీచేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. ఇక తన కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని.. రాజకీయాలు చేస్తున్నారని రాజయ్య తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘనపూర్ లో 5వ సారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతాను అంటూ ఎమ్మెల్యే రాజయ్య శపథం చేశారు.