MLa Rajasingh: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
ఎన్డీయే తరపున రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన గిరిజన మహిళ అయిన ద్రౌపతి ముర్మును ఉద్దేశించి సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ ఓ వేస్ట్ ఫెలో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎరితో ఏ విధంగా ఉండాలో, ఎవరిపట్ల ఎలా స్పందించాలో తెలియని దద్దమ్మా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రామ్ గోపాల్ వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. గిరిజన మహిళను దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తే అభినందించాల్సింది పోయి. ద్రౌపతి ఉంటే మరి పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు అని మాట్లాడటం ఎంటని ప్రశ్నించారు.
ఆదివాసీ మహిళ అత్యున్నత స్థానానికి ఎన్నిక అవుతున్న సమయంలో వర్మ ఇలాంటి ట్వీట్ చేయడం బాధాకరమన్నారు. మరోవైపు తన ట్వీట్‌పై స్పందించిన వర్మ తనకు మహా భారతంలో ద్రౌపతి పాత్ర అంటే చాలా గౌవరం అన్నాడు. ద్రౌపతి పేరు వినగానే తనకు సంబంధించిన వారు గుర్తొచ్చారన్నారు.