MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్య పై మరో వివాదం
MLA Rajaiah: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆమధ్య ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఫోన్లు చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళతానని జానకీపురం మహిళా సర్పంచ్ తెలిపారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారని డబ్బు కావాలన్నా..బంగారం కావాలన్నీ ఏది కావాలన్నా ఇస్తాను.. రాజకీయ ఎదుగుదల కావాలంటే రాజయ్య చెప్పినట్లు విను అని మహిళలతో ఫోన్ చేయిస్తున్నారని.. జానకీపురం మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. సర్పంచ్ నవ్య చేసిన ఈ ఆరోపణలు జిల్లాలో సంచలనంగా మారాయి. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు.
తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సొంత పార్టీ వారే కొంతమంది నాపై కుట్ర పన్ని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని నేను ఎవ్వరికి ఫోన్లు చేయలేదు..ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని రాజయ్య తెలిపారు. ఈ ఆరోపణల గురించి స్వయంగా సీఎం కేసీఆర్ ను..కలిసి అన్నీ వివరిస్తానని తెలిపారు. ఇంటి దొంగలే శిఖండులగా మారి నాపై ఇటువంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు. గతంలో అనేకమార్లు రాజయ్యపై మహిళలు ఆరోపణలు చేశారు.