ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్ తో మంత్రుల భేటి
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీలో జరిగిన పరిణామాలపై మంత్రులు సీఎంకు వివరించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదని చెప్పడంతో.. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలపై సీఎం మంత్రులతో చర్చించారు. సీఎం నుంచి పిలుపు రావడంతో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రగతి భనవ్‌కు వెళ్లారు
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే వరకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు రైతులతో కలిసి ఉద్యమం చేసే అవకాశం ఉంది. దీనిపై కూడా సీఎం కేసీఆర్ వారితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేసే విధంగా సీఎం కేసీఆర్ మంత్రులతో చర్చించారు. దీంతో పాటు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ధాన్యం కొనుగోలుపై తీర్మానాలు చేసి ఆ లేఖలను కేంద్రానికి పంపాలని సీఎం మంత్రులకు సూచించించారు.