Minister Ktr: నేను చెప్పేది తప్పయితే రాజీనామా కి సిద్ధం.. కేటీఆర్
Minister Ktr: రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని బండి సంజయ్ ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు కేటీఆర్. అన్నం పెట్టని కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తూ చలి మంటలతో ఓట్లు సంపాదించుకోవాలనే వారిని రాష్ట్రంలోకి రానీయకూడదన్నారు. మంగళవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్‌మాట్లాడుతూ.. సెక్రటేరియట్, ప్రగతి భవన్ ను కూలగొట్టాలని అంటున్నారని, తాము బ్రహ్మాండంగా కడుతుంటే వాళ్లు కూలగొట్టాలంటున్న విషయాన్నిప్రజలు గమనించాలని అన్నారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి అందిన ఆదాయం రూ.2.72లక్షల కోట్లు కాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.1.42లక్షల కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. తాను చెప్పింది తప్పయితే తన పదవికి రాజీనామా చేస్తానని బండి సంజయ్ చెప్పింది అబద్దమైతే ఆయన రాజీనామా చేస్తారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి రూపాయి కేంద్రానికి వెళ్తే 45 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని, మిగతా పైసలు బీజేపీ పాలిత వెనకబడిన రాష్ట్రాలకు వెళ్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేలను ఎలా కొనబోయారో దేశం మొత్తం చూసిందన్నారు.
మన రక్తం, మన చెమటతో దేశంలోని వెనుకబడ్డ ఇతర రాష్ట్రాలకు కేంద్రం నిధులు తీసుకెళ్తోందన్నారు. తెలంగాణను ప్రధాని మోదీ దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణాలో పండించిన ధాన్యం కొనేది లేదని కేంద్రం చెబుతోందని కేంద్రంపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేను మాట్లాడే ప్రతిమాతకు బండి సంజయ్ సమాధానం చెప్పగలడా ఒక వేళ వీటికి సరైన సమాధానం చెప్తే నేను రాజీనామా చేస్తా.. సమాధానం చెప్పక పోతే బండి సంజయ్ రాజీనామాచేస్తాడా అని అన్నారు.