వెదర్ అలర్ట్: వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుంది. ఉష్ణోగ్రత ప్రతీ రోజు 40 డిగ్రీలకంటే అధికంగా నమోదౌతుంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్న సమయాల్లో ఇళ్లనుంచి బయటకు రావొద్దన్ని తెలిపింది. ముఖ్యంగా వృద్ధులు ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించింది. వేసవి కాలంలో ఎవరూ నల్లటి దుస్తులు ధరించవద్దని, ప్రతీ ఒక్కరు తెల్లటి దుస్తులు ధరించాలని, తెల్లటి దుస్తూలు ధరిస్తే ఎండ ప్రభావం శరీరంపై తక్కువగా పడుతుందని తెలిపింది.
ఎండలో తీరిగే వారు ఫ్లూయిడ్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలని వైద్య అధికారులు తెలిపారు. చెమట పట్టడం, గొంతు ఎండిపోవడం, అత్యంత నీరసంగా ఉండటం, తలనొప్పి, గుండెదడ, మూత్రం రాకపోవడం వంటి సమస్యలు ఉంటే ఆ వ్యక్తికి వడదెబ్బ తగిలినట్లుగా భావించాలని, ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలని వైద్యులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు, గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసేవాళ్ళు, జర్నలిస్టులు, ఎక్కువగా తిరిగే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.