మంత్రి మల్లారెడ్డి అంటేనే ఓ స్పెషల్. ఆయ మాట తీరు. భాష, యాస, సందర్భాన్ని బట్టీ ఆయన పేల్చే డైలాగుల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు.
MALLAREDDY COMMENTS ON POLICE : తెలంగాణ (Telangana) కార్మిక మంత్రి (Labour Minister) మల్లారెడ్డి ( Mallareddy) అంటేనే ఓ సెన్సేషన్ (Sensation). ఆయన ఏం చేసినా.. ఎక్కడికెళ్లినా ఏదో ఓ స్పెషాలిటీ చూపెడతారు. తాను సినిమాల్లోకి రావాలని ఉందని.. అవకాశం ఇస్తే సినిమాల్లోకి వస్తానంటూ ఓమూవీ ఫంక్షన్ లో మల్లారెడ్డి మాట్లాడి అందరినీ ఆకర్షించారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి పోలీసుల (Police)నుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పొట్ట (Belly)ఉన్న పోలీసులకు ప్రమోషన్లు (Promitions) ఇవ్వొద్దని.. హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లను మల్లారెడ్డి కోరారు. అంతేకాకుండా పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, మన పోలీసులు బాగా పని చేస్తున్నారని, కేసులను తొందరగా పరిష్కరిస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు. పోలీసులు తమ మాదిరి మంచి ఫిట్ గా ఉండాలని చెప్పారు మల్లారెడ్డి. పోలీసులను చూస్తే దొంగలు భయపడిపోవాలని అన్నారు. పోలీసులు స్మార్ట్ గా ఉండాలన్నారు. చూస్తేనే భయపడేలా ఉండాలన్నారు. అయితే మంత్రి మాటలకు హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ సరదాగా నవ్వేశారు. ఎక్కడికెళ్లినా ప్రోగ్రామ్ ను బట్టీ డైలాగ్స్ ప్రిపేర్ చేసుకోవటం ఆయన ప్రత్యేకత. మల్లారెడ్డి సభ కోసం.. మల్లా రెడ్డి మాటల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పక్కన ఎవరున్నా లెక్క చేయకుండా మట్లాడుతూ సభను జోష్ లోకి తీసుకు రావటమే ఆయనలో ప్రత్యేకత.