మల్కాజ్గిరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అసంతృప్తి నేత మైనంపల్లి హన్మంత రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.రేపటి నుంచి మల్కాజ్గిరి నియోజవర్గంపైనే దృష్టి సారిస్తానని .. వారం రోజుల తర్వాత ప్రతీ ప్రశ్నకు సమాధానం చెబుతానని అన్నారు.
Mynampally Hanmantha Rao: మల్కాజ్గిరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అసంతృప్తి నేత మైనంపల్లి హన్మంత రావు(Mynampally Hanmantha Rao) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. మెదక్ ప్రజలే తనకు రాజకీయ భిక్ష పెట్టారని మైనంపల్లి హన్మంత రావు(Mynampally Hanmantha Rao) అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన ఓటర్లు కూడా తనను చూసి తనకు రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేశారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే తాను గెలిచానని, ఎవరో భిక్ష పెడితే గెలవలేదని మైనంపల్లి చెప్పుకొచ్చారు.
ఏ పదవి లేకపోయినా కూడా తన కంటే తన కొడుకు రోహిత్ (Reohith)ఎక్కువగా పని చేస్తున్నాడని మైనంపల్లి అన్నారు. రేపటి నుంచి మల్కాజ్గిరి నియోజవర్గంపైనే మెయిన్‌గా దృష్టి సారిస్తానని అన్నారు. వారం రోజుల తర్వాత ప్రతీ ప్రశ్నకు తాను సమాధానం చెబుతానని చెప్పారు.
తాజాగా తన కుమారుడికి టికెట్ రాకుండా.. మంత్రి హరీశ్ రావు( Harish Rao) అడ్డుకున్నారని ఇటీవల మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీసింది. ఇండిపెండెంట్‌గా అయినా సరే తాను, తన కుమారుడు ఇద్దరం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం పొలిటికల్ సర్కిల్లో కాక రేపింది. హరీశ్ రావు అడ్డదారిలో లక్షల కోట్లు సంపాదించుకున్నాడని..అవన్నీ త్వరలోనే బయటకు తీస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా రేపటి నుంచి మల్కాజ్గిరి నియోజవర్గంపైనే దృష్టి సారిస్తానని .. వారం రోజుల తర్వాత ప్రతీ ప్రశ్నకు సమాధానం చెబుతానని చెప్పడంతో.. మరోసారి మైనంపల్లి హన్మంతరావు( Mynampally Hanmantha Rao) వార్తల్లో నిలుస్తున్నారు.