రాజయ్య డిప్యూటీ సీఎం పదవి పోవడానికి అసలు కారణం కడియం శ్రీహరి(Kadiam Srihari)నే అంటూ మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga)సంచలన ఆరోపణలు చేశారు. అసలు కడియం శ్రీహరికి బీఆర్ఎస్ బీ ఫామ్ ఎలా వస్తుందో తాము చూస్తామని మందకృష్ణ మాదిగ సవాల్ చేశారు.
Manda Krishna Madiga : ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah)తో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga)భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మందకృష్ణ మాదిగ .. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiam Srihari)పై మండిపడ్డారు. కడియం శ్రీహరిని గుంట నక్కతో పోలుస్తూ విమర్శించారు. రాజయ్య డిప్యూటీ సీఎం పదవి పోవడానికి అసలు కారణం కడియం శ్రీహరినే అంటూ మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. ఘన్పూర్లో మాదిగ సీటు కేవలం మాదిగకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.అసలు కడియం శ్రీహరికి బీఆర్ఎస్ బీ ఫామ్ ఎలా వస్తుందో తాము చూస్తామని మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) సవాల్ చేశారు.
నిజానికి కొద్దిరోజులుగా స్టేషన్ ఘన్పూర్ గురించి బీఆర్ఎస్లో అసమ్మతి రాగం రోజు రోజుకు మరింత రాజుకుంటుందనే చెప్పాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిగా .. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiam Srihari)ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచీ ఘన్పూర్ బీఆర్ఎస్లో.. కడియం వర్సెస్ తాటికొండగా అక్కడి పాలిటిక్స్ మారిపోయాయి. తాజాగా మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) చేసిన కామెంట్లు ఈ వేడిని మరింత రాజేసినట్లు అయ్యాయి.