భారీ ఎత్తున క్లియర్ అవుతున్న ట్రాఫిక్ చలాన్లు
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్లపై పోలీసులు ప్రకటించిన డిస్కౌంట్‌లకు భారీ ఎత్తున స్పందన వస్తుంది. గత నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ ప్రాంతాల్లో 650 కోట్లకుపైగా చలాన్లు క్లియర్ అయ్యాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఇందులో రాయతీ పోగా 190 కోట్ల సొమ్ము ఖజానాకు చేరిందన్నారు. ప్రతీ రోజు 7 నుంచి 10 లక్షల చలాన్లు క్లియర్ అవుతున్నాయన్నారు.
హైదరాబాద్ నగరంలోనే అత్యధికంగా చలాన్లు క్లియర్ అయ్యాయని తెలిపారు. మార్చి 31 వరకు వాహనదారులు చలాన్లు క్లియర్ చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ నుంచి ట్రాఫిక్ రూల్స్ కఠినంగా ఉంటాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలపై స్టికర్స్ వేసుకొని తిరుగుతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో స్పీడ్ లిమిట్ ఒకే రకంగా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇక నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్‌లపై కఠిన చర్యలు ఉంటాయని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు.